నేనున్నాను! | Saaho teaser release | Sakshi
Sakshi News home page

నేనున్నాను!

Jun 14 2019 12:45 AM | Updated on Jul 17 2019 10:14 AM

Saaho teaser release - Sakshi

ప్రభాస్‌

‘బాధ అయినా, సంతోషం అయినా నాతో షేర్‌ చేసుకోవడానికి ఎవరూ లేరు’ అని బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ అంటే... ‘నేనున్నాను’ అని భరోసా ఇస్తున్నారు ప్రభాస్‌. అంతేనా.. ప్రభాస్, శ్రద్ధాకపూర్‌లపై గన్స్‌తో ఎటాక్‌ జరుగుతున్నప్పుడు ‘అసలు ఎవరు వీళ్లు?’ అని శ్రద్ధ అడుగుతుంది... ‘ఫ్యాన్స్‌’ అని ప్రభాస్‌ సమాధానం. ఇంతలో శ్రద్ధ అక్కడి నుంచి వెళ్లాలని ప్రయత్నిస్తుంది. ఫైరింగ్‌ సౌండ్‌ రెట్టింపు అవుతుంది.. ‘ఇంత వయొలెంట్‌గా ఉన్నారేంటి’ అని ప్రభాస్‌ను ఆమె అడిగితే.. ‘డైహార్డ్‌ ఫ్యాన్స్‌’ అని సమాధానం చెబుతాడు ప్రభాస్‌. ఈ డైలాగ్స్‌తో పాటు కొన్ని యాక్షన్‌ సీన్లతో గురువారం విడుదలైన ‘సాహో’ టీజర్‌ అదిరిపోయిందని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సాహో’.

ఇందులో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఇదివరకే ప్రభాస్, శ్రద్ధాకపూర్‌ లుక్స్‌ను రిలీజ్‌ చేసిన టీమ్‌ ఇటీవల ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 1’, ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 2’ వీడియోలను కూడా విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా దాదాపు 98 సెకన్లు నిడివి ఉన్న ‘సాహో’ టీజర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజమౌళి, నాగార్జున, రానా.. ఇలా పలువురు సినీ ప్రముఖులు ‘సాహో’ టీజర్‌ను ప్రశంసించారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. త్వరలో ఆస్ట్రియాలో ప్రభాస్, శ్రద్ధాకపూర్‌లపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను తీయబోతున్నారని తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement