సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’ | Saaho Second Single May Release On 30th July | Sakshi
Sakshi News home page

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’

Jul 29 2019 6:49 PM | Updated on Jul 29 2019 6:54 PM

Saaho Second Single May Release On 30th July - Sakshi

బాహుబలి చిత్రంతో ప్రభాస్‌ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్‌ హీరో నుంచి ఇండియన్‌ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ దేశమంతటా ఉన్నారు. అందుకే బాహుబలి చిత్రాల తరువాత మళ్లీ ఆరేంజ్‌లో ఉండే విధంగా ‘సాహో’ను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్స్‌తో అంచనాలను పెంచేసింది చిత్రయూనిట్‌.

రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్‌ సింగిల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి సోషల్‌ మీడియాలో సునామీ పుట్టించేందుకు సాహో టీమ్‌ రెడీ అయింది. ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ను విడుదల చేయనుంది చిత్రబృందం. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ కూడా వైరల్‌ అవుతోంది. ఏ చోట నువ్వున్నా.. అంటూ సాగే ఈ పాటను రేపు విడుదల చేయనున్నారు. ఈ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement