పంద్రాగస్టుకు ట్రైలర్‌? | Saaho new poster launch | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

Jul 26 2019 12:24 AM | Updated on Jul 26 2019 12:24 AM

Saaho new poster launch - Sakshi

ప్రభాస్, శ్రద్ధా కపూర్‌

‘సాహో’ ప్రమోషన్స్‌ మస్త్‌ స్పీడ్‌ మీద ఉన్నాయి. రోజుల వ్యవధిలో కొత్త పోస్టర్స్‌ను విడుదల చేస్తూ ‘సాహో’ సందడి మొదలుపెట్టింది చిత్రబృందం. తాజాగా ‘సాహో’ చిత్రానికి సంబంధించి మరో కొత్త యాక్షన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటించారు.

భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు నిర్మించారు. గతంలో ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో ఛాప్టర్‌ 1’, ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 2’లతో పాటు టీజర్‌ను కూడా ‘సాహో’ చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను పంద్రాగస్టుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. జాకీష్రాఫ్, నీల్‌నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, ‘వెన్నెల’ కిశోర్, ప్రకాష్‌ బెల్వాది తదితరులు నటించిన ఈ చిత్రం ఆగస్టు 30న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement