సాహో ‘బేబీ వొంట్‌ యూ టెల్‌ మీ’ పాట విడుదల

Saaho New Love Song Baby Won't You Tell Me Released - Sakshi

సాహో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఆ సినిమాకు సంబంధించిన ఒక్కోవార్త సోషల్‌  మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలోని మూడు పాటలను ఒక్కొక్కట్టిగా రిలీజ్‌ చేస్తూ ప్రేక్షకులను ఊరిస్తూ వస్తున్న చిత్రబృందం తాజాగా ‘బేబీ వోంట్‌ యూ టెల్‌ మీ’  పాటను విడుదల చేసింది. హీరో ప్రభాస్‌ ‘సాహో నుంచి రొమాంటిక్‌, మెలోడియస్‌ పాట విడుదల’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను పోస్ట్‌ చేశాడు.  ఈ పాటకు విడుదలైన ఒక్క గంటలోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

ఇప్పటికే ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌ మరో పాటను విడుదల చేసింది. ‘బేబీ వొంట్‌ యూ టెల్‌ మీ’ అంటూ సాగనున్న ఈ పాటకు మనోజ్‌ యాదవ్‌  లిరిక్స్‌ని అందించాడు. శంకర్‌ , ఎహాన్స్‌, లాయ్‌ త్రయంలు హీందీ వెర్షన్లో  ఈ పాటను కంపోస్‌ చేయగా శంకర్‌ మహదేవన్‌​, రవి మిష్రా, అలిస్సా మన్డొన్సా  ఆలపించారు. అందమైన సాహిత్యంతో కూడిన పాట సన్నివేశాలను అస్ట్రియాలోని పలు అద్భతమైన సుందర ప్రదేశాల్లో చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో ప్రభాస్‌, శ్రద్ధలు పోలీసుల పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆగష్టు 30న విడుదల చేయనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top