ఎన్టీఆర్‌ బాగున్నాడు.. అవన్నీ రూమర్స్‌ | Rumours About Ntr Injury | Sakshi
Sakshi News home page

Mar 13 2018 3:18 PM | Updated on Jul 14 2019 4:05 PM

Rumours About Ntr Injury - Sakshi

‘జై లవ కుశ’ సినిమాలో ఎన్టీఆర్‌

సోషల్ మీడియాతో పాటు కొన్ని వెబ్‌ సైట్స్‌ చూపిస్తున్న అత్యుత్సాహం సినీ సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కొందరు ఆకతాయిలు కావాలని క్రియేట్‌ చేస్తున్న రూమర్స్‌ కూడా సెలబ్రిటీలకు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా ఈ రూమర్స్ బారిన పడ్డాడు. రాజమౌళి సినిమా కోసం అమెరికా వెళ్లిన జూనియర్‌కు అక్కడ ప్రమాదం జరిగినట్టుగా రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ విషయంపై ఎన్టీఆర్ పీఆర్‌, నిర్మాత మహేష్‌ కోనేరు స్పందించారు. ఓ అభిమాను ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినట్టుగా ఓ వెబ్‌సైట్‌ ఉన్న వార్తపై క్లారిటీ కోరగా.. అవన్నీ రూమర్స్‌, ఎన్టీఆర్‌ బాగున్నారు.. షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు అంటూ స్పందించారు. త్వరలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్న ఎన్టీఆర్‌. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ తో కలిసి మల్టీ స్టారర్‌ సినిమాలో నటించనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement