రుద్రమదేవి విడుదల వాయిదా | Rudramadevi postponed | Sakshi
Sakshi News home page

రుద్రమదేవి విడుదల వాయిదా

Jun 18 2015 8:07 PM | Updated on Aug 28 2018 4:30 PM

రుద్రమదేవి విడుదల వాయిదా - Sakshi

రుద్రమదేవి విడుదల వాయిదా

గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రుద్రమదేవి చిత్రం విడుదల వాయిదా పడింది.

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రుద్రమదేవి చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయాలని భావించారు. అయితే గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తికానందున ఆలస్యమైంది. దర్శకుడు గుణశేఖర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఫేస్బుక్లో ఈ మేరకు వెల్లడించారు. అత్యుత్తమ గ్రాఫిక్స్ అందించేందుకు వందలాదిమంది టెక్నిషియన్లు పనిచేస్తున్నారని, నిర్ణీత సమయానికి చిత్రాన్ని విడుదల చేయడం సాధ్యంకాదని తెలిపారు. కాగా ఎప్పుడు విడుదల చేస్తామన్న విషయాన్ని గుణశేఖర్ తెలియజేయలేదు.

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన మరో భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి వచ్చే నెల 10న విడుదల కానుంది. ఇక మహేహ్ బాబు చిత్రం 'శ్రీమంతుడు' ఆగస్టు 7న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రుద్రమదేవి చిత్రాన్ని ఆగస్టులో లేదా ఆ తర్వాత విడుదల చేసే అవకాశముందని సమాచారం. రుద్రమదేవిగా అనుష్క నటించగా, ఇతర ముఖ్య పాత్రలను యువ హీరోలు అల్లు అర్జున్, రానా పోషించారు.

Advertisement
 
Advertisement
Advertisement