60 కోట్ల మార్క్‌ను దాటి.. | Rowdy Baby Song Crossed 600 Million Views In YouTube | Sakshi
Sakshi News home page

60 కోట్ల మార్క్‌ను దాటి..

Aug 13 2019 5:02 PM | Updated on Aug 13 2019 5:05 PM

Rowdy Baby Song Crossed 600 Million Views In YouTube - Sakshi

ధనుష్‌, సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ‘మారి 2’ చిత్రం తమిళ్‌లో కమర్షియల్‌ సక్సెస్‌ సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్‌ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే చిత్ర యూనిట్‌ కూడా సినిమా విడుదలైన కొద్ది రోజులకే రౌడీ బేబీ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తుంది. సౌత్‌ ఇండియన్‌ సాంగ్స్‌కు యూట్యూబ్‌లో ఎక్కువగా వ్యూస్‌ రావని చెప్పేవారికి ఇది గట్టి కౌంటర్‌ ఇచ్చింది. పలు బాలీవుడ్‌ సాంగ్స్‌తో పోటీ పడుతూ.. యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. తాజాగా ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో 600 మిలియన్‌(60 కోట్ల) వ్యూస్‌ను దాటింది. కేవలం సౌత్‌ ఇండియన్‌ ప్రేక్షకులే కాకుండా విదేశాల్లో ఉంటున్నవారు కూడా ఈ సాంగ్‌ను విపరీతంగా వీక్షిస్తున్నారు. 

కాగా, బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. రౌడీ బేబీ సాంగ్‌కు ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. మరోవైపు సోషల్‌ మీడియాలో సాయిపల్లవి వీడియో సాంగ్‌లు హల్‌చల్‌ చేస్తుంటాయనే సంగతి తెలిసిందే. ఫిదా చిత్రంలోని వచ్చిండే సాంగ్‌ను కూడా యూట్యూబ్‌లో కోట్లాది మంది ప్రేక్షకులు వీక్షించారు. అయితే ఆ వ్యూస్‌ను రౌడీ బేబీ సాంగ్‌ కేవలం 40 రోజుల వ్యవధిలోనే అధిగమించిడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement