ఐ యామ్‌ అవినాష్‌ | Ronnie Screwvala brings Dulquer Salmaan to Bollywood | Sakshi
Sakshi News home page

ఐ యామ్‌ అవినాష్‌

Feb 1 2018 12:44 AM | Updated on Feb 1 2018 12:44 AM

Ronnie Screwvala brings Dulquer Salmaan to Bollywood - Sakshi

దుల్కర్‌ సల్మాన్

అవినాష్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఐదంకెల జీతం. వీకెండ్‌ పార్టీలు, పబ్‌లు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో అవుటింగ్‌లు. పుల్‌ బిందాస్‌ లైఫ్‌. ఎప్పుడూ ఒకేలా ఉంటే అది లైఫ్‌ ఎందుకవుతుంది? సడన్‌గా లైఫ్‌లో బిగ్‌ టర్న్‌. అంతే ఆల్‌ చేంజ్‌. జాబ్‌లోనే కాదు అతని లైఫ్‌లో కూడా. హిందీ చిత్రం ‘కర్వాన్‌’ స్టోరీ లైన్‌ ఇదేనట. దుల్కర్‌ సల్మాన్, ఇర్ఫాన్‌ ఖాన్, కృతి కర్భందా, మిథిలా పాల్కర్, రోనీ స్క్రూవాలా ముఖ్య తారలుగా ఆకాశ్‌ ఖురానా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతోనే మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

‘‘ఇర్ఫాన్‌ ఖాన్, రోనీ స్క్రూవాలాతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా హ్యాపీ. ఈ సినిమా జర్నీలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. స్టార్టింగ్‌ డే నుంచి షూటింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నా. ఇంత మంచి టీమ్, ఇలాంటి మంచి సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు దుల్కర్‌ సల్మాన్‌. రోడ్‌ జర్నీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందట. అది సరే.. ఇంతకీ అవినాష్‌ ఎవరో చెప్పలేదు కదూ. తెలుగులో అయితే.. అఖిల్‌ గుర్తుకు రావొచ్చు. ‘హలో’లో తను చేసిన పాత్ర పేరది. బట్‌... ‘కర్వాన్‌’లో మై నేమ్‌ ఈజ్‌ అవినాష్‌ అంటున్నారు దుల్కర్‌ సల్మాన్‌.

Advertisement
 
Advertisement
Advertisement