కూర్గ్‌లో రొమాన్స్ | Romance in coorg | Sakshi
Sakshi News home page

కూర్గ్‌లో రొమాన్స్

May 24 2014 12:48 AM | Updated on Sep 2 2017 7:45 AM

కూర్గ్‌లో రొమాన్స్

కూర్గ్‌లో రొమాన్స్

నాగశౌర్య, ‘ఉయ్యాల జంపాల’ ఫేం అవికా గోరే జంటగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి’.

నాగశౌర్య, ‘ఉయ్యాల జంపాల’ ఫేం అవికా గోరే జంటగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. నంద్యాల రవి దర్శకుడు. గిరిధర్ మామిడిపల్లి నిర్మాత. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమ, కుటుంబ బంధాల మేళవింపు ఈ సినిమా. ఇటీవలే హీరోహీరోయిన్లపై కూర్గ్‌లోని అందమైన పరిసరాల్లో ఓ మెలొడీ పాటను చిత్రీకరిచాం.  కేఎం రాధాకృష్ణన్ స్వరపరిచిన ఈ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. అలాగే ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలు కూడా అక్కడే షూట్ చేశాం. ఈ నెల 31 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలుపెడతాం’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement