రొమాన్స్‌.. కామెడీ.. థ్రిల్‌ | Romance .. comedy .. thrill | Sakshi
Sakshi News home page

రొమాన్స్‌.. కామెడీ.. థ్రిల్‌

May 20 2017 12:03 AM | Updated on Sep 5 2017 11:31 AM

రొమాన్స్‌.. కామెడీ.. థ్రిల్‌

రొమాన్స్‌.. కామెడీ.. థ్రిల్‌

‘‘గమ్యం, శంభో శివ శంభో’ చిత్రాల తర్వాత అంతటి శక్తిమంతమైన కథతో నరేశ్‌ చేస్తున్న చిత్రం ‘మేడ మీద అబ్బాయి’.

‘‘గమ్యం, శంభో శివ శంభో’ చిత్రాల తర్వాత అంతటి శక్తిమంతమైన కథతో నరేశ్‌ చేస్తున్న చిత్రం ‘మేడ మీద అబ్బాయి’. రొమాంటిక్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌. థ్రిల్లింగ్‌ అంశాలతో పాటు నరేశ్‌ శైలి వినోదం ఉంటుంది. నరేశ్‌ను కొత్త కథలో చూడాలనుకునే వారికి ఈ సినిమాతో ఆ లోటు తీరుతుంది’’ అని నిర్మాత బొప్పన చంద్రశేఖర్‌ అన్నారు. ‘అల్లరి’ నరేశ్, నిఖిలా విమల్‌ జంటగా జి.ప్రజీత్‌ దర్శకత్వంలో రూపొందుతోంది.

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఒరు వడక్కన్‌ సెల్ఫీ’ చిత్రానికి ఈ చిత్రం రీమేక్‌ అనే విషయం తెలిసిందే. నిర్మాత మాట్లాడుతూ– ‘‘పొలాచ్చిలో జరిగిన భారీ షెడ్యూల్‌ తర్వాత హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ జరుగుతోంది. 90 శాతం షూటింగ్‌ పూర్తయింది. బ్యాలెన్స్‌ పాటను త్వరలోనే పూర్తి చేసి, జూన్‌ చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఉన్ని ఎస్‌. కుమార్, సంగీతం: షాన్‌ రెహమాన్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎం.ఎస్‌.కుమార్, సమర్పణ: శ్రీమతి నీలిమ.

Advertisement
 
Advertisement
Advertisement