సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ అవుతాడు | Rogue Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ అవుతాడు

Mar 2 2017 11:35 PM | Updated on Mar 22 2019 1:53 PM

సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ అవుతాడు - Sakshi

సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ అవుతాడు

‘‘నేను చాలా రోజుల తర్వాత తెరకెక్కించిన ప్రేమకథ ఇది.

– పూరి జగన్నాథ్‌
‘‘నేను చాలా రోజుల తర్వాత తెరకెక్కించిన ప్రేమకథ ఇది. ఇషాన్ లో హీరో లక్షణాలు బాగా ఉన్నాయి. సౌత్‌ ఇండియాకు శ్రీదేవిని పరిచయం చేసిన రాఘవేంద్రరావుగారు ఎంత హ్యాపీగా ఫీలవుతున్నారో, ఈరోజు నేనూ అంతే సంతోషంగా ఫీలవుతున్నా. హండ్రెడ్‌ పర్సెంట్‌ ఇషాన్‌ సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ అవుతాడు’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. ఇషాన్ , మన్నార్‌ చోప్రా, ఏంజెలా హీరో, హీరోయిన్ప్ గా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా. సీఆర్‌ మనోహర్, సీఆర్‌ గోపి నిర్మించిన లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘రోగ్‌’. మరో చంటిగాడి ప్రేమకథ అన్నది ఉపశీర్షిక.

ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సీఆర్‌ మనోహర్‌ మాట్లాడుతూ– ‘‘ఇషాన్‌ ఫొటో పూరీగారికి చూపించడంతో, కుర్రాడు బాగున్నాడని, అదే రోజు మనం సినిమా చేస్తున్నామని, కథ వినడానికి రమ్మని అన్నారు. ఎంతో మంది స్టార్‌ హీరోలను ఇంట్రడ్యూస్‌ చేసిన పూరి కొత్త కుర్రాడు ఇషాన్ తో సినిమా చేస్తాననగానే హ్యాపీ ఫీలయ్యా’’ అన్నారు. ‘‘సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్‌ నేర్చుకుని ఇండస్ట్రీకి రాకుండా ఉండి ఉంటే పూరీగారి వంటి మంచి వ్యక్తితో పని చేసే అవకాశం కోల్పోయి ఉండేవాణ్ణి’’ అన్నారు ఇషాన్‌. నటుడు ఆలీ, హీరోయిన్లు మన్నార్‌ చోప్రా, ఏంజెలా, రచయిత భాస్కరభట్ల రవికుమార్, సంగీతదర్శకుడు సునీల్‌ కశ్యప్‌  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement