సరోజ్‌ ఖాన్‌ను సమర్ధించిన రిచా

Richa Chadda Defended Choreographer Saroj Khan On Casting Couch - Sakshi

ముంబై : శ్రీరెడ్డి అర్దనగ్న నిరసన తర్వాత కాస్టింగ్‌ కౌచ్‌ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలీవుడ్‌ సీనియర్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ మాత్రం ఈ ఉదంతంపై భిన్నంగా స్పందించారు.  క్యాస్టింగ్‌ కౌచ్‌ని సమర్ధించేలా సరోజ్‌ ఖాన్‌ మాట్లాడరనే విమర్శలు వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం ఆమె చెప్పిన దాంట్లో తప్పేముందని సమర్ధిస్తున్నారు.

తాజాగా ఈ అంశంపై బాలీవుడ్‌ నటి రిచా చద్దా స్పందించారు. సరోజ్‌ ఖాన్‌ వ్యాఖ్యాలను ఆమె సమర్ధించారు. ఈ విషయాన్ని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. బాలీవుడ్‌లో కూడా దుష్ప్రవర్తనకు పాల్పడేవారున్నారు. ఇది అన్ని రంగాల్లోను ఉందని, బాలీవుడ్‌ని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారని ఆమె ప్రశ్నించారు.

ఇదే అంశంపై ట్విటర్‌లో కూడా ఆమె స్పందించారు. ‘నేను కూడా సరోజ్‌ ఖాన్‌ ఇంటర్వ్యూ చూశాను. ఆమె క్యాస్టింగ్‌ కౌచ్‌కి మద్దతుగా మాట్లాడారని అనుకోవడం లేదు. ఫిల్మ్‌ ఇండస్ట్రీని మాత్రమే ఎందుకు అలా చూస్తారని ఆమె ప్రశ్నించారు. సరోజ్‌ ఖాన్‌ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. రేప్‌ అనే పదం వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది అసహ్యకరమైన చర్య, దీని నివారణకు చర్యలు తీసుకోవాల’ని రిచా చద్దా అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top