‘ఐస్‌క్రీమ్’ తయారీలో వర్మ | RGV-Navdeep's 'Ice cream' to be released on July 4th | Sakshi
Sakshi News home page

‘ఐస్‌క్రీమ్’ తయారీలో వర్మ

Jun 9 2014 10:29 PM | Updated on Sep 2 2017 8:33 AM

‘ఐస్‌క్రీమ్’ తయారీలో వర్మ

‘ఐస్‌క్రీమ్’ తయారీలో వర్మ

దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ‘ఐస్‌క్రీమ్’ తయారీలో బిజీబిజీగా ఉన్నారు. వర్మ ఏంటి? ‘ఐస్‌క్రీమ్’ తయారు చేయడమేంటి? అనుకుంటున్నారా! వర్మ తాజా సినిమా పేరు ‘ఐస్‌క్రీమ్’.

 దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ‘ఐస్‌క్రీమ్’ తయారీలో బిజీబిజీగా ఉన్నారు. వర్మ ఏంటి? ‘ఐస్‌క్రీమ్’ తయారు చేయడమేంటి? అనుకుంటున్నారా! వర్మ తాజా సినిమా పేరు ‘ఐస్‌క్రీమ్’. అదన్నమాట అసలు విషయం. శివ, అంతం, గాయం, సత్య, సర్కార్, రక్త చరిత్ర... ఇవన్నీ వాస్తవికతకు అద్దంపట్టే వర్మ మార్కు యాక్షన్ ఎంటర్‌టైనర్లయితే.. రాత్రి, దెయ్యం, భూత్.. ఇత్యాది చిత్రాలన్నీ ఆయన తీసిన హారర్ చిత్రాలు. ఈ రెండిటికీ భిన్నమైన ‘రంగీలా’ లాంటి జానర్లు కూడా వర్మ టచ్ చేశారు.
 
 అయితే.. ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తున్న ‘ఐస్‌క్రీమ్’ వీటన్నింటికీ భిన్నమైన తరహా చిత్రమని సమాచారం. నవదీప్, తేజస్వి ఇందులో ప్రధాన పాత్రధారులు. గత రెండు నెలలుగా ఏకబిగిన జరిగిన షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని జూలై 4న విడుదల చేయడానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేయనున్నారు వర్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement