టాప్‌ టెన్‌లో రేవంత్‌ | REVANTH In the top ten in Indian Idol-9 | Sakshi
Sakshi News home page

టాప్‌ టెన్‌లో రేవంత్‌

Jan 27 2017 11:11 PM | Updated on Sep 5 2017 2:16 AM

టాప్‌ టెన్‌లో రేవంత్‌

టాప్‌ టెన్‌లో రేవంత్‌

తెలుగు ప్రేక్షకులకి రేవంత్‌ తెలుసు. ‘బాహుబలి’లో ‘మనోహరీ..’ పాటతో పాటు తెలుగు చిత్రాల్లో పలు హిట్‌ పాటలు పాడిన ఈ యువ గాయకుడి పేరు ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వినిపిస్తోంది.

తెలుగు ప్రేక్షకులకి రేవంత్‌ తెలుసు. ‘బాహుబలి’లో ‘మనోహరీ..’ పాటతో పాటు తెలుగు చిత్రాల్లో పలు హిట్‌ పాటలు పాడిన ఈ యువ గాయకుడి పేరు ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వినిపిస్తోంది. సోనీ టీవీలో ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే సింగింగ్‌ రియాలిటీ షో ‘ఇండియన్‌ ఐడల్‌–9’లో రాకింగ్‌ ఫర్‌ఫార్మెన్స్‌తో రేవంత్‌ ముందుకు దూసుకువెళ్తున్నాడు.

ఆల్రెడీ టాప్‌ 10లోకి ఎంటరైన రేవంత్‌కి ఈ రోజు (శనివారం) జరగనున్న కాంపిటీషన్‌ కీలకంగా మారింది. ఇందులో విజయం సాధిస్తే రేవంత్‌ టాప్‌ 8లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అతను ‘ఇండియన్‌ ఐడల్‌–9 విన్నర్‌’గా నిలవడానికి ప్రేక్షకుల ఓటింగ్‌ (ఎస్సెమ్మెస్‌), మద్దతు చాలా అవసరమవుతాయి. ఇప్పటికే పలువురు రేవంత్‌పై అభిమానాన్ని సోనీ టీవీ ఫేస్‌బుక్‌ పేజీలో అతని వీడియోకి లైక్స్‌ కొడుతూ, మద్దతు ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement