సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. బుల్లిరాజుకు ప్రతిష్టాత్మక అవార్డ్ | Sankranthiki Vastunnam Movie bagged two INCA Awards | Sakshi
Sakshi News home page

Sankranthiki Vastunnam Movie: సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. బుల్లిరాజుకు క్రేజీ అవార్డ్

Apr 8 2026 8:48 PM | Updated on Apr 9 2026 12:25 PM

Sankranthiki Vastunnam Movie bagged two INCA Awards

గతేడాది సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఫుల్ ఫ్యామీలీ కామెడీ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద  రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు.

తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. తాజాగా ప్రకటించిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ(ఐఎన్‌సీఏ) అవార్డులకు ఎంపికైంది. బెస్ట్ డైరెక్టర్‌తో పాటు బెస్ట్ యాక్టర్ కామెడీ రోల్ విభాగంలో అవార్డులు కొల్లగొట్టింది. బెస్ట్ డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి అవార్డ్ సొంతం చేసుకోగా.. కామెడీ రోల్ బెస్ట్ యాక్టర్‌గా రేవంత్(బుల్లిరాజు) దక్కించుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ప్రత్యేక పోస్టర్స్‌ను రిలీజ్ చేస్తూ గుడ్‌ న్యూస్‌ పంచుకుంది. ఐఎన్సీఏ అవార్డులు ప్ర‌క‌టించ‌డం ఇదే మొదటిసారి కావడం విశేషం. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement