ఇంస్టాగ్రామ్ లో పవన్, ఆధ్య ఫోటో పోస్ట్ చేసిన రేణు | Renu Posted Pawan and AAdhya Photo In Instagram - Sakshi
Sakshi News home page

పవన్‌,ఆద్య ఫొటో షేర్‌ చేసిన రేణూ

Jan 2 2020 8:58 AM | Updated on Jan 2 2020 12:09 PM

Renu Desai Shares Addya And Pawan Photo - Sakshi

పవన్‌ నుంచి విడిపోయాక రేణూదేశాయ్‌ పిల్లలతో కలిసి పూణెలో నివాసం ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ.. తన పిల్లలకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆద్య తన తండ్రి పవన్‌ కల్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోను రేణూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దానికి ఫాదర్‌ అండ్‌ డాటర్‌, డాటర్స్‌ లవ్‌ అని కాప్షన్స్‌ కూడా జత చేశారు. ‘అద్భుతంగా, చాలా అందంగా పిల్లలు తల్లిదండ్రుల నుంచి పోలికలు పొందుతారు. ఆద్య కొన్నిసార్లు నాలానే కనిపిస్తుంది.. కానీ చాలాసార్లు వాళ్ల నాన్న, నాన్నమ్మకు కాపీలా కనపిస్తోంది. ఆధ్య నా కెమెరాకి ఇష్టమైన వ్యక్తి’ అని పేర్కొన్నారు. 

ఇటీవల ఓ నెటిజన్‌ కామెంట్‌పై రేణూదేశాయ్‌ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయిన సంగతి తెలిసిందే. ఆద్య, అకీరాలు కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేసి క్రేజీ ఫెలోస్‌.. వాళిద్దరు నా సొంతం అని పేర్కొన్నారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ ఎంతైనా పవన్‌ రక్తం కదా అని కామెంట్‌ చేశాడు. దీంతో రేణూ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ‘సైన్స్‌ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్‌ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అని సమాధానం ఇచ్చారు. కాగా, ఇటీవలకాలంలో పవన్‌ పేరు అంతగా ప్రస్తావించని రేణూ.. ఇప్పుడు ఆయన ఫొటోను షేర్‌ చేయడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. 

Advertisement
 
Advertisement
Advertisement