కిలాడీ లేడీ! | Regina Cassandra FIRST LOOK from Nakshatram Movie | Sakshi
Sakshi News home page

కిలాడీ లేడీ!

Oct 16 2016 11:26 PM | Updated on Sep 15 2019 12:38 PM

కిలాడీ లేడీ! - Sakshi

కిలాడీ లేడీ!

‘‘ఈ అమ్మాయి పేరు జమునా రాణి. పోలీస్ కాదు గానీ అప్పుడప్పుడు పోలీస్ డ్రస్ వేసుకుంటుంది.

‘‘ఈ అమ్మాయి పేరు జమునా రాణి. పోలీస్ కాదు గానీ అప్పుడప్పుడు పోలీస్ డ్రస్ వేసుకుంటుంది. ఖాకీ చొక్కాపై నక్షత్రాలను చూపిస్తూ హల్ చల్ చేస్తుంది. ఈ లేడీ కిలాడీ కహానీ తెలుసుకోవాలంటే ‘నక్షత్రం’ చూడండి’’ అంటున్నారు రెజీనా. సందీప్ కిషన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నక్షత్రం’. ఇందులో సందీప్‌కి జోడీగా జమునా రాణి పాత్రలో రెజీనా నటిస్తున్నారు. ఆదివారం జమునా రాణి ఫస్ట్ లుక్‌ను రామ్‌చరణ్ విడుదల చేశారు.

సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ అతిథి పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కె. శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు నిర్మిస్తున్నారు. విజయదశమి నుంచి ప్రతి రోజూ చిత్ర బృందం ఒక్కో లుక్ విడుదల చేస్తోంది. పది రోజుల పాటు పది ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తామని చెప్పారు. అందులో రెజీనాది నాలుగో లుక్. ఇంకా ఆరు లుక్స్ ఉన్నాయనమాట.

Advertisement
 
Advertisement
Advertisement