యాషికా ఎందుకు ఆత్మహత్య చేసుకుందంటే? | Reasons For Yashika To Commit Suicide | Sakshi
Sakshi News home page

యాషికా ఎందుకు ఆత్మహత్య చేసుకుందంటే?

Feb 16 2019 12:21 PM | Updated on Feb 16 2019 1:21 PM

Reasons For Yashika To Commit Suicide - Sakshi

పెరంబూరు: సహాయ నటి యాషికా రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తనతో సహజీవనం చేసిన మోహన్‌బాబు అనే వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు యాషిక తన సెల్‌ఫోన్‌లో వాగ్మూలం ఇచ్చింది. దీంతో ఆ సెల్‌ఫోన్‌ ఆమె తల్లి పెరవలూర్‌ పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేస్తూ తన కూతురు మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. రంగంలోకి దిగిన  పోలీసులు యాషికాను మోసం చేసినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న మోహన్‌బాబును అరెస్ట్‌ చేశారు.విచారణలో అతను పలు విషయాలను తెలిపాడు. తాను వడపళిలోని సెల్‌ఫోన్‌ దుకాణంలో పనిచేస్తున్నానని, అక్కడికి సెల్‌ఫోన్‌ రీచార్జ్‌ చేసుకోవడానికి వచ్చే నటి యాషికాతో పరిచయం ప్రేమగా మారిందని, దీంతో పెళ్లి చేసుకోవాలని నిరయించుకున్నామని చెప్పాడు.

అయితే ఇరు కుటుంబాల అనుమతి తీసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నామన్నారు. అప్పటి వరకూ కలిసి జీవించాలని నిర్ణయించుకుని పెరవలూర్‌లోని జీకేఎం.కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని నివశించామన్నాడు. అయితే సినిమా నటిగా రాణించాలన్న ఆశతో యాషికా రోజూ బయట తిరిగొచ్చేదన్నాడు. అదే విధంగా ఆడంబర జీవితానికి అలవాట పడిందని, తాను ఖర్చు తగ్గించుకోమని ఎంత చెప్పినా పట్టించుకోలేదని చెప్పాడు. ఈ విషయంలో తమ మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగేదని, అలానే ఇటీవల జరిగిన వివాదం పెద్దదవడంతో తాను తన అమ్మ,నాన్నల వద్దకు తిరిగి వెళ్లిపోయానన్నాడు. అయితే యాషికా ఆత్యహత్యకు పాల్పడుతుందని ఊహించలేదని అన్నాడు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు మోహన్‌బాబును పుళల్‌ జైలుకు తరలించారు. 

చదవండి : బుల్లితెరపై మరో విషాదం.. నటి యషిక ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement