విలన్‌ పాత్రలకు సిద్ధమే | RDX Love Movie updates | Sakshi
Sakshi News home page

విలన్‌ పాత్రలకు సిద్ధమే

Oct 7 2019 4:49 AM | Updated on Oct 7 2019 4:49 AM

RDX Love Movie updates - Sakshi

తేజస్‌ కంచెర్ల, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా శంకర్‌ భాను దర్శకత్వంలో  తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’. సి. కల్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా  తేజస్‌ కంచెర్ల మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు సిద్ధు. సినిమాలో అలివేలు(పాయల్‌  రాజ్‌పుత్‌ పాత్ర) తన లక్ష్యాన్ని చేరుకోవడానికి సిద్ధు ఏం చేశాడు? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. పాయల్‌ రాజ్‌పుత్‌ మంచి నటి. ఈ సినిమాలో ఆమెది చాలా బలమైన పాత్ర. స్క్రీన్‌పై మా ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకు ఒక హైలైట్‌. నిర్మాత సి. కల్యాణ్‌గారు ఫోన్‌ చేసి మంచి పాత్ర ఉంది ఓ సారి కథ వినమని చెప్పారు.

కథ విన్న తర్వాత ఇందులోని నా పాత్ర నచ్చింది. అందుకే కష్టపడి పని చేశాను. టీజర్‌ విడుదలైనప్పుడు ఇది అడల్ట్‌ కంటెంట్‌ మూవీ అన్నారు. కానీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉత్సుకతను పెంచడానికే టీజర్‌ను అలా కట్‌ చేశాం. ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు చూడవచ్చు. వినోదంతో పాటు ఓ సీరియస్‌ ఇష్యూని కూడా ప్రస్తావించడం జరిగింది. కేవలం హీరో పాత్రలే కాదు.. కథ నచ్చితే ప్రతినాయకుడి పాత్రలు చేయడానికి సిద్ధమే. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. సినిమా తప్ప నాకేం తెలియదు. సినిమాల మీద నేను సంపాదించింది కూడా మళ్లీ సినిమాలోనే పెడతాను. ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాను’’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement