రెచ్చిపోతున్న రాయ్‌లక్ష్మి | Ray Laksmi act in Glamour roles | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న రాయ్‌లక్ష్మి

Aug 24 2016 1:17 AM | Updated on Sep 4 2017 10:33 AM

రెచ్చిపోతున్న రాయ్‌లక్ష్మి

రెచ్చిపోతున్న రాయ్‌లక్ష్మి

నటి రాయ్‌లక్ష్మి గ్లామర్ అంతు చూడాలని కంకణం కట్టుకున్నట్లున్నారు. ఆ విధంగా గ్లామర్‌నే

నటి రాయ్‌లక్ష్మి గ్లామర్ అంతు చూడాలని కంకణం కట్టుకున్నట్లున్నారు. ఆ విధంగా గ్లామర్‌నే సిగ్గుపడేలా దుస్తులు ధరించి వేదికలెక్కెస్తున్నారు. కళ్లార్పకుండా చూడడం చూపరులపనవుతోంది. తమిళంలోనే పలు చిత్రాల్లో గ్లామరస్‌గా నటించి దుమ్మురేపిన రాయ్‌లక్ష్మి తాజాగా బాలీవుడ్‌లో మరింతగా రెచ్చిపోతున్నారు. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అంటూ ఒక రౌండ్ కొట్టిన రాయ్‌లక్ష్మి ఇప్పుడు బాలీవుడ్‌ను టార్గెట్ చేశారు. కబాలి హీరోయిరెచిపోతున్ రాధికాఆప్తే ఇటీవల ఒక ఆంగ్ల చిత్రం కోసం నటించిన టాప్‌లెస్ దుస్తుల సన్నివేశాలు ఇంటర్నెట్‌లో కలకలం పుట్టించిన విషయం తెలిసిందే.
 
  ఇక నటి కాజల్‌అగర్వాల్, శ్రుతిహాసన్ టాప్‌లెస్ దుస్తులతో సినిమాల్లో నటించకపోయినా, ఆ తరహా దుస్తులతో ఆంగ్ల పత్రికల ముఖ చిత్రాలకు ఫోజులిచ్చి సంచలనం కలిగించారు. ఇప్పుడు వాళ్ల వరుసలో నటి రాయ్‌లక్ష్మి చేరారు. హిందీ చిత్రం జూలీ-2 లో ఇప్పటికే టూ పీస్, ఈత దుస్తుల్లో నటించి బాలీవుడ్ పరిశ్రమ వర్గాల దృష్టిని తనపై తిప్పుకునే ప్రయత్నం చేసిన ఈ సంచలన నటి ఇటీవల టాప్‌లెస్ దుస్తులు ధరించి సినిమా కార్యక్రమంలో పాల్గొని హల్‌చల్ చేశారు.
 
  బాలీవుడ్ బ్యూటీస్ ప్రియాంకా చోప్రా, దీపికాపదుకొనే లాంటి వారు బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లే ప్రయత్నంలో ఉంటే, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ రంగప్రవేశం చేయాలన్న తన కోరిక నె రవేరడంతో రాయ్‌లక్ష్మి అక్కడి సినీ వర్గాలను ఆకర్షించి బాలీవుడ్‌లోనే సెటిల్ అవ్వాలన్న ఆలోచినలో భాగంగానే గ్లామర్ అంతు చూసే ప్రయత్నంలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement