రొమాంటిక్‌ పోలీస్‌!

Raviteja Crack Movie Shooting at cheerala - Sakshi

బీచ్‌లో ప్రేయసితో ప్రేమరాగం తీస్తున్నారట రవితేజ. ‘డాన్‌ శీను’(2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్‌’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. బి. మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చీరాలలోని ఓ బీచ్‌లో జరుగుతోందట. అక్కడ ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను చిత్రీకరించే పనిలో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ పాట చిత్రీకరణకు ముందు ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు రవితేజ. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే8న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top