‘అఅఆ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్‌! | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 5 2018 4:38 PM

Raviteja Amar Akbar Anthony Pre Release event On 10th November - Sakshi

మాస్‌ మహరాజా రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌ అంటే ప్రేక్షకులకు అంచనాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వెంకీ, దుబాయ్‌ శ్రీను లాంటి కామెడీ ఎంటర్‌టైనర్స్‌ వచ్చాయి. అయితే చాలా ఏళ్ల తరువాత మళ్లీ వీరిద్దరు కలిసి చేస్తోన్న మూవీ ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ . రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్‌తో అంచనాలు పెరిగాయి. 

ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. నవంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నవంబర్ 10న నిర్వహించబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మొదటి పాటకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తోంది. రెండవ పాటను దీపావళి సందర్భంగా మంగళవారం విడుదల చేయనున్నారు. రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Advertisement
 
Advertisement