ఉతికి ఆరేస్తాడు | Ravi Teja's Touch Chesi Chudu First Look Released | Sakshi
Sakshi News home page

ఉతికి ఆరేస్తాడు

Dec 30 2017 12:58 AM | Updated on Dec 30 2017 12:58 AM

Ravi Teja's Touch Chesi Chudu First Look Released - Sakshi

కూల్‌గా కామ్‌గా ఉన్నవాడిని అనవరంగా కదిలిస్తేనే ఏదో రకంగా రియాక్ట్‌ అవ్వడానికి ట్రై చేస్తాడు. అలాంటిది బలుపు, పవర్‌ ఉన్న మాస్‌ అబ్బాయిని కెలికితే ఊరుకుంటాడా? దమ్ము చూపించి, వాళ్ల దుమ్మ దులిపి ఉతికారేస్తాడు. మరి.. మా హీరో ఉతుకుడు ఏ రేంజ్‌లో ఉందో చూడాలంటే మా సినిమా వచ్చేంతవరకు ఆగాల్సిందే అంటున్నారు ‘టచ్‌ చేసి చూడు’ చిత్ర బృందం. రవితేజ హీరోగా విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘టచ్‌ చేసి చూడు’.

రాశీ ఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం రిలీజ్‌ చేశారు. ‘‘రవితేజతో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. రవితేజ ఇమేజ్‌ తగ్గట్లుగా రచయిత వక్కంతం వంశీ సూపర్‌ కథను అందించారు. షూటింగ్‌ కంప్లీటైంది. ప్రజెంట్‌ రీ–రికార్డింగ్‌ వర్క్‌ జరుగుతుంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం : ప్రీతమ్‌ జామ్‌8, కెమెరా: చోటా. కె. నాయుడు.

Advertisement
 
Advertisement
Advertisement