టచ్‌ చేస్తే... | Ravi Teja's Touch Chesi Chudu Censor Review | Sakshi
Sakshi News home page

టచ్‌ చేస్తే...

Jan 25 2018 1:38 AM | Updated on Jan 25 2018 1:38 AM

Ravi Teja's Touch Chesi Chudu Censor Review - Sakshi

‘రాజా ది గ్రేట్‌’ సినిమా హిట్‌తో మాంచి ఊపు మీదున్నారు రవితేజ. అదే స్పీడ్‌తో విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో ‘టచ్‌ చేసి చూడు’ సినిమాని పూర్తి చేశారాయన. ఇందులో రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 2న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు బుజ్జి, వంశీ మాట్లాడుతూ– ‘‘మా చిరకాల మిత్రుడు రవితేజతో ‘టచ్‌ చేసి చూడు’ సినిమా నిర్మించినందుకు చాలా ఆనందంగా ఉంది.

రవి ఇమేజ్‌కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు. ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసిన పాటలకు, టీజర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. మా చిత్రంలో రవితేజ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారని అందరూ ప్రశంసిస్తున్నారు. సెన్సార్‌ నుంచి యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది. ఈ వారంలో ప్రీ–రిలీజ్‌ వేడుక ఘనంగా నిర్వహిస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జామ్‌ 8, కెమెరా: ఛోటా కె.నాయుడు.

Advertisement
 
Advertisement
Advertisement