‘నేల టికెట్‌’కు 25 కోట్లు | Ravi Tejas Nela Ticket Grabs Big Deal | Sakshi
Sakshi News home page

Feb 18 2018 11:00 AM | Updated on Feb 18 2018 11:01 AM

Ravi Tejas Nela Ticket Grabs Big Deal - Sakshi

హీరో రవితేజ

రాజా ది గ్రేట్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మాస్‌మహారాజ్‌ రవితేజ తరువాత టచ్‌చేసి చూడు సినిమాతో మరోసారి తడబడ్డాడు. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్‌ స్టార్‌ నేల టికెట్‌ సినిమాలో నటిస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి రెండు వరుస విజయాల తరువాత కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్‌ కూడా దాదాపుగా పూర్తయినట్టుగా చిత్రయూనిట్‌ ప్రకటించారు. సినిమాకు సంబందించిన డిజిటల్‌, శాటిలైట్‌, హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ను ఓ ప్రముఖ టీవీ ఛానల్‌ 25 కోట్లకు సొంతం చేసుకుంది. గత చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. మాస్ లో రవితేజకు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇంతటి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement