స్టార్ హీరో వారసుడొస్తున్నాడు..! | ravi teja son Mahadhana to make his acting debut | Sakshi
Sakshi News home page

స్టార్ హీరో వారసుడొస్తున్నాడు..!

Sep 5 2017 3:03 PM | Updated on Sep 17 2017 6:26 PM

స్టార్ హీరో వారసుడొస్తున్నాడు..!

స్టార్ హీరో వారసుడొస్తున్నాడు..!

ఇండస్ట్రీలో అతి చిన్న స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రవితేజ. మహా మహరాజ్గా తిరుగులేని

ఇండస్ట్రీలో అతి చిన్న స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రవితేజ. మహా మహరాజ్గా తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రవితేజ ఈ మధ్య కాస్త స్లో అయ్యాడు. వరుస ఫ్లాప్లు ఎదురవ్వటంతో లాంగ్ గ్యాప్ తీసుకొని ప్రస్తుతం రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు సినిమాలు చేస్తున్నాడు. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా ది గ్రేట్ ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చింది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. రవితేజ కుమార్ మహాధన ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడట. ఈ సినిమాలో రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్లో మహాధన నటిస్తున్నాడు. రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ అంధుడిగా నటిస్తున్నాడు. అంటే తొలి సినిమాలోనే అంధుడిగా ఛాలెంజింగ్ రోల్తో వెండితెరకు పరిచయం అవుతున్నా మహాధన. మెహ్రీన్ కౌర్ హీరోయిన్గా నటిస్తున్న రాజా ది గ్రేట్, అక్టోబర్ 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement