సూపర్ కిక్ ఇస్తుంది | ravi teja kick 2 audio platinum disc celebrations | Sakshi
Sakshi News home page

సూపర్ కిక్ ఇస్తుంది

Aug 16 2015 11:06 PM | Updated on Jul 12 2019 4:40 PM

సూపర్ కిక్ ఇస్తుంది - Sakshi

సూపర్ కిక్ ఇస్తుంది

‘‘రవితేజ అంటే బయట హీరో కాదు.. ఆయన మా కుటుంబ సభ్యుడే. షూటింగ్ స్టార్ట్ అయ్యాక కేవలం రెండు రోజులు మాత్రమే నేను లొకేషన్‌కు వెళ్లానంటే...

 ‘‘రవితేజ అంటే బయట హీరో కాదు.. ఆయన మా కుటుంబ సభ్యుడే. షూటింగ్ స్టార్ట్ అయ్యాక కేవలం రెండు రోజులు మాత్రమే నేను లొకేషన్‌కు వెళ్లానంటే... రవితేజ, దర్శకుడు సురేందర్‌రెడ్డిల మీద నమ్మకమే కారణం. వారిద్దరూ తమ సొంత ప్రాజెక్ట్‌లా ఫీలయ్యి ఈ సినిమా చేశారు’’ అని నందమూరి కల్యాణ్‌రామ్ చెప్పారు. రవితేజ, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ నిర్మించిన చిత్రం ‘కిక్-2’. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
 
  ‘‘మంచి కథా కథనాలతో రూపొందిన ఈ చిత్రం అందరికీ సూపర్ కిక్‌నిస్తుంది’’ అని రవితేజ అన్నారు. ‘‘నా కెరీర్‌లో ‘కిక్-2’ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. రవితేజ అంటేనే ఎనర్జీ. ఈ సినిమాలో ఆయన ఎనర్జీ పెరిగిందే గాని తగ్గలేదు’’ అని సురేందర్‌రెడ్డి అన్నారు. ‘‘వక్కంతం వంశీ- సురేందర్‌రెడ్డి లది హిట్ పెయిర్. వీరి కాంబినేషన్‌లో వస్తున్న ‘కిక్-2’ మంచి సక్సెస్ అవుతుంది’’ అని వీవీ వినాయక్ అన్నారు. రచయిత వక్కంతం వంశీ, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement