రాజా లుక్‌ అదుర్స్‌

ravi teja disco raja new poster release - Sakshi

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్‌ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు గ్రాఫిక్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో రవితేజ లుక్‌ అదుర్స్‌ అంటున్నారు ఆయన అభిమానులు. అదేవిధంగా ఈ నెల 19న ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త. ‘వెన్నెల’ కిషోర్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాని డిసెంబరు 20న విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top