చల్నేదొ గాడీ | Raveena Tandon takes an auto journey | Sakshi
Sakshi News home page

చల్నేదొ గాడీ

Mar 3 2020 1:32 AM | Updated on Mar 3 2020 1:32 AM

Raveena Tandon takes an auto journey - Sakshi

సౌకర్యవంతమైన ఖరీదు గల కారుల్లో తిరిగే సెలబ్రిటీలు సడన్‌గా ఆటోలో ప్రత్యక్షమైతే వింతగానే ఉంటుంది. అలాంటి ఒక వింతను షేర్‌ చేసుకున్నారు నటి రవీనా టాండన్‌. తన మేనకోడలి మెహందీ ఫంక్షన్‌కి వెళ్లడానికి రెడీ అయ్యారామె. కారు సకాలంలో రాకపోవడంతో చల్నేదొ గాడీ అంటూ కూతురు రాషాతో కలసి ఆటోలో బయల్దేరారు. ‘‘ఆటోలో ప్రయాణం చాలా లవ్లీగా అనిపించింది’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారామె. మరి.. ఆటో డ్రైవర్‌ గుర్తు పట్టలేదా? అని ఫాలోయర్స్‌ అడిగితే– ‘‘గుర్తుపట్టారు. ఆయన పేరు అర్షద్‌. నా అభిమాని అని చెప్పారు. ఆటో దిగే ముందు ఆయనతో కాసేపు మాట్లాడాను’’ అన్నారు రవీనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement