breaking news
auto journey
-
ఆటోలో రెండు రోజుల్లో 1400 కి.మీ. ప్రయాణం!
'ఆశ కేన్సర్ ఉన్న వాడిని బతికిస్తుంది. భయం అల్సర్ ఉన్న వాడిని కూడా చంపేస్తుంది'.. జులాయి సినిమాలోని డైలాగ్ ఇది. ఇప్పుడీ డైలాగ్ ఎందుకు గుర్తుకు వచ్చిందనేగా మీ డౌటు? అయితే మనవ గురుగ్రామ్‌కు చెందిన ఇజ్రాయెల్, అష్రఫుల్ అనే ఇద్దరు ఆటోడ్రైవర్ల గురించి తెలుసుకోవాలి. అంత ఘనకార్యం ఏం చేశారని అనుకుంటున్నారా? మామూలుగా సేఫ్టీ ఫీచర్లన్నీ సవ్యంగా ఉన్న కారులో ఓ వంద కిలోమీటర్ల ప్రయాణం అంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. కానీ పైన చెప్పుకున్న ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి రెండు ఆటోల్లో ఏకబిగిన 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. వారేదో సరదా కోసమో, థ్రిల్ కోసమో అలా చేయలేదు. మరెందుకు చేశారు?ఇజ్రాయెల్, అష్రఫుల్ అన్నదమ్ములు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా గజోల్ పట్టణం నుంచి పని వెతుక్కుంటూ 16 ఏళ్ల క్రితం ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌కు వలస వెళ్లారు. చిన్న చిన్న పనులు చేసి కూడబెట్టిన డబ్బుతో రెండు ఆటోలు కొనుక్కుని జీవనం సాగిస్తున్నారు. భర్తలకు తోడుగా వారి భార్యలు గురుగ్రామ్ (Gurugram) సెక్టార్ 49లో ఇళ్లల్లో పనిచేసేవారు. ఇజ్రాయెల్‌కు 9 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అంతా సాఫీగా గడిచిపోతుదనుకుంటున్న సమయంలో 15 రోజుల క్రితం వారి జీవితాల్లో కల్లోలం రేగింది.బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చేడనే అనుమానంతో ఇజ్రాయెల్, అష్రఫుల్ బంధువొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత పోలీసులు అతడిని విడుదల చేసినప్పటికీ, ఇద్దరు సోదరులకు ఇబ్బందులు మొదలయ్యాయి. వారుంటున్న ఇల్లు ఖాళీ చేయాలని యజమాని హుకుం జారీచేశాడు. దీనికి తోడు పోలీసుల భయం. 'మమ్మల్నిఇంటి ఓనర్ ఖాళీ చేయమన్నాడు. మా దగ్గర ఆధార్ కార్డు, EPIC ఉన్నాయి. కానీ ఏదో భయం. పోలీసులు మమ్మల్ని కూడా తీసుకెళ్తారని బాగా భయపడిపోయాం. అలాంటి అనిశ్చితిలో గురుగ్రామ్‌ను విడిచిపెట్టాలనుకున్నాం. మాకు జీవనాధారమైన ఆటోలను వదిలిపెట్టేందుకు మనసు రాలేదు. ఆటోల్లోనే గజోల్కు తిరిగి వెళ్లాలనుకున్నామ'ని ఇజ్రాయెల్ చెప్పాడు.పోలీసులకు లంచాలు ఇచ్చి..అనుకున్నదే తడవుగా కొన్ని ముఖ్యమైన వస్తువులను ప్యాక్ చేసుకుని ఇద్దరు సోదరులు కుటుంబ సభ్యులతో కలిసి రెండు ఆటోల్లో ఆగస్టు 1 గురుగ్రామ్ నుంచి బెంగాల్‌కు ప్రయాణం మొదలుపెట్టారు. అయితే వారి ప్రయాణం సాఫీగా సాగలేదు. హైవేలపై పోలీసులు కనిపించిప్పుల్లా భయంతో వణికిపోయారు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) గుండా వెళుతున్నపుడు కొంత మంది పోలీసులకు లంచాలు ఇచ్చి ముందుకు సాగారు. బిహార్‌లో దారి తప్పిపోయారు. ఉత్తర దినాజ్‌పూర్‌లోని రాయ్గంజ్లో వెళ్లడంతో రూటు మారిపోయింది. చివరకు దక్షిణ దినాజ్‌పూర్‌లోని బునియాద్‌పూర్ వద్ద ట్రాఫిక్ పోలీసుల సహాయంతో మళ్లీ సరైన దారిలోకి వచ్చారు. ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా రెండున్నర రోజుల్లో ఆటోల్లో 1400 కిలోమీటర్లు ప్రయాణించి సొంతూరికి చేరుకున్నారు. వీరి గురించి మాల్దా జిల్లా (Malda District) అధికార యంత్రాంగానికి సమాచారం అందడంతో కలెక్టర్ నితిన్ సింఘానియా స్పందించారు. అన్నిధాలుగా వారికి సహాయం అందిస్తామని హామీయిచ్చారు.మళ్లీ గురుగ్రామ్‌కు..సొంతూరికి వచ్చిన తర్వాత మళ్లీ భవిష్యత్తు గురించి బెంగ మొదలైంది. పని కోసం మళ్లీ గురుగ్రామ్‌కు వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే అక్కడ పోలీసుల వేధింపులు తగ్గే వరకు వేచి ఉంటామని వారు మీడియాకు చెప్పారు. పోలీసు భయం కారణంగానే ఈ సోదరులిద్దరూ ఇంత రిస్క్ చేసి ఆటోల్లో సొంతూరికి తిరిగొచ్చారు. చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు! -
చల్నేదొ గాడీ
సౌకర్యవంతమైన ఖరీదు గల కారుల్లో తిరిగే సెలబ్రిటీలు సడన్‌గా ఆటోలో ప్రత్యక్షమైతే వింతగానే ఉంటుంది. అలాంటి ఒక వింతను షేర్ చేసుకున్నారు నటి రవీనా టాండన్. తన మేనకోడలి మెహందీ ఫంక్షన్‌కి వెళ్లడానికి రెడీ అయ్యారామె. కారు సకాలంలో రాకపోవడంతో చల్నేదొ గాడీ అంటూ కూతురు రాషాతో కలసి ఆటోలో బయల్దేరారు. ‘‘ఆటోలో ప్రయాణం చాలా లవ్లీగా అనిపించింది’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారామె. మరి.. ఆటో డ్రైవర్ గుర్తు పట్టలేదా? అని ఫాలోయర్స్ అడిగితే– ‘‘గుర్తుపట్టారు. ఆయన పేరు అర్షద్. నా అభిమాని అని చెప్పారు. ఆటో దిగే ముందు ఆయనతో కాసేపు మాట్లాడాను’’ అన్నారు రవీనా. -
ప్రమాదంతోప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం!
గుంటూరు, పెదకాకాని: గ్రామాల్లో ఆటో ప్రయాణం ప్రాణాలతో చెలగాటంగా మారింది. డ్రైవర్ల అత్యాశ, ప్రయాణికుల అవసరం ప్రమాదాలకు కారణమవుతోంది. ఎన్నో జీవితాలను చీకటిలోకి నెట్టేస్తోంది. పెదకాకాని మండల పరిధిలోని నంబూరు గ్రామం నుంచి వెనిగండ్ల మిరపకాయల కోతలు, పత్తి తీసేందుకు బయలుదేరారు. ఆరుగురు మాత్రమే ప్రయాణం చేసే అప్పీఆటోలో 18 మంది ఎక్కారు. వెనుక, ముందు, పక్కన వేలాడుతూ ప్రయాణాలు చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ సోమవారం క్లిక్ మనిపించింది. -
అదుపు తప్పితే ఇక అంతే!
- పరిమితికి మించి ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం అమ్రాబాద్: ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవడంతో గంటల తరబడి నిరీక్షించిన ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేక ప్రయాణం చేస్తున్నారు. మండలంలోని అమ్రాబాద్, తిర్మలాపూర్(బీకే), లఖ్మాపూర్(బీకే), మాదవానిపల్లి, జంగంరెడ్డిపల్లి, కల్ములోనిపల్లి తదితర గ్రామాల నుంచి ఆటోలు జీపులు అధికంగా తిరుగుతాయి. ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించుకుని ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఆయాగ్రామాల్లో వాహనాలు బోల్తాపడి ప్రయాణికులు గాయాలపాలైన ఘటనలూ లేకపోలేదు. అప్పుడప్పుడు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ జరిమానాలు వేస్తున్నా ప్రైవేట్వాహనదారుల్లో మార్పు రావడంలేదు. -
ఆటోలో...అలా.. అలా...!
‘చల్లో.. చల్లో.. హవా మే గాడీ చల్లో. హమారే సాత్ చల్లో..’ అంటూ ‘బెంగాల్ టైగర్’లో రవితేజ, రాశీఖన్నా కారు, బైక్.. ఇలా పలు వాహనాల్లో వెళుతూ పాట పాడుకున్నారు. ఇప్పుడు రియల్‌గా శ్రుతీహాసన్, ఆమె చెల్లెలు అక్షరా హాసన్ కూడా ఈ పాటలో ఉన్నట్లే చేశారు. కాకపోతే ఆ జంట కారు, బైక్‌లో వెళితే ఈ అక్కాచెల్లెళ్లు ఆటోలో జర్నీ చేశారు. చెన్నై సిటీ అంతా మూడు చక్రాల వాహనంలో ఆనందంగా చక్కర్లు కొట్టేశారు. ఈ ఆనందం వెనక కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! గత వారం కమల్ కాలికి గాయమైనప్పుడు శ్రుతీహాసన్ నార్వేలో ఉన్నారు. నాగచైతన్య సరసన నటిస్తున్న ‘ప్రేమమ్’ పాటల చిత్రీకరణ నిమిత్తం అక్కడ ఉండాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు తండ్రికి ఎలా ఉందోనని ఫోన్ చేసి తెలుసుకుంటూనే ఉన్నారట. నార్వేలో షూటింగ్ పూర్తయిన వెంటనే చెన్నైకి వచ్చిన శ్రుతి నేరుగా తండ్రి దగ్గరికి వెళ్లారు. హాస్పిటల్లో కమల్‌ను చూసిన తర్వాత గానీ శ్రుతి మనసు కుదుట పడలేదట. తండ్రి కోలుకోవడం చూసి రిలీఫ్ అయిపోయారు. ఆ తర్వాత చెల్లెలు అక్షరాహాసన్తో కలసి ఆటోలో తిరుగుతూ ఎంజాయ్ చేశారు. హ్యాపీగా ఉన్నప్పుడు ఆటోలో తిరగడం శ్రుతీకి అలవాటు. ఈ ఏడాది మార్చిలో స్నేహితులతో అర్ధరాత్రి ఆటోలో చక్కర్లు కొట్టారు. -
ప్రాణం.. 'ఆటో' ఇటో!
వీళ్లూ మనుషులే. వీరివీ ప్రాణాలే. ఓ తల్లి బిడ్డలే. ప్రమాదం జరిగితే ఆ కన్నపేగు పడే బాధ తెలియనిది కాదు. అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నా.. స్వచ్ఛందంగా చదువుకునేందుకు ముందుకొచ్చే విద్యార్థుల బాగోగులను అధికారులు ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. తమ పిల్లలు బాగుంటే చాలు అనుకున్నారో.. ఏమో. రోజూ మృత్యువుపై సవారీ చేస్తున్న బడి పిల్లలను చూస్తే.. దారినపోయే వారెవరికైనా మనసులో ముల్లుగుచ్చుకోక మానదు. మరి అధికారులు ఏమి చేస్తున్నట్లు? గొల్లలదొడ్డి(సి.బెళగల్): మండల పరిధిలోని గొల్లలదొడ్డి విద్యార్థులు సి.బెళగల్‌లోని ఆదర్శ, ఉన్నత పాఠశాలలకు వెళ్లేందుకు సమయానికి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు సమయానికి చేరుకునేందుకు ఆటోలను ఆశ్రయిస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు కర్నూలు నుంచి గ్రామానికి బస్సు సర్వీసును ఏర్పాటు చేసినా.. పాఠశాలల సమయానికి అందుబాటులో లేకపోవడం గమనార్హం. గతంలో 7.30 గంటలకే గ్రామానికి వచ్చే బస్సు.. ప్రస్తుతం 11.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు వస్తోంది. విద్యార్థులకు ఈ సర్వీసులు ఏమాత్రం ఉపయోగపడని పరిస్థితి. గ్రామంలో దాదాపు 40 మంది విద్యార్థినీ, విద్యార్థులు సి.బెళగల్‌లోని ఆదర్శ, ఉన్నత పాఠశాలలకు, గూడూరులోని జూనియర్ కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఆయా పాఠశాలలు, కాలేజీలు ఉదయం 9 గంటలకే తెరుస్తుండటంతో గ్రామం నుంచి విద్యార్థులు ఆటోల్లో వేళాడుతూ అతి కష్టం మీద చేరుకుంటున్నారు. ఈ పరిస్థితి ఒక్క గొల్లలదొడ్డి గ్రామస్తులదే కాదు.. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గ్రామీణ విద్యార్థుల అవస్థ ఇదే. విధిలేని పరిస్థితుల్లో ఆటోలను ఆశ్రయిస్తుండగా.. వాళ్లకీ నాలుగు డబ్బులు వస్తుండటంతో ప్రమాదమని తెలిసీ సామర్థ్యానికి మించి విద్యార్థులను అందులో కుక్కేస్తున్నారు. బస్సుల్లోనూ టాపుపై ప్రయాణిస్తున్నారు. పోలీసులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తరచూ తనిఖీలు చేపట్టకపోవడం ఎందరి ప్రాణాలు బలిగొంటుందోననే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.