అదుపు తప్పితే ఇక అంతే! | passengers face issues with RTC bus timings | Sakshi
Sakshi News home page

అదుపు తప్పితే ఇక అంతే!

Mar 19 2017 10:23 PM | Updated on Sep 5 2017 6:31 AM

ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవడంతో గంటల తరబడి నిరీక్షించిన ప్రజలు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

- పరిమితికి మించి ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణం
అమ్రాబాద్‌: ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవడంతో గంటల తరబడి నిరీక్షించిన ప్రజలు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేక ప్రయాణం చేస్తున్నారు. మండలంలోని అమ్రాబాద్‌, తిర్మలాపూర్‌(బీకే), లఖ్మాపూర్‌(బీకే), మాదవానిపల్లి, జంగంరెడ్డిపల్లి, కల్ములోనిపల్లి తదితర గ్రామాల నుంచి ఆటోలు జీపులు అధికంగా తిరుగుతాయి.

ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించుకుని ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఆయాగ్రామాల్లో వాహనాలు బోల్తాపడి ప్రయాణికులు గాయాలపాలైన ఘటనలూ లేకపోలేదు. అప్పుడప్పుడు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ జరిమానాలు వేస్తున్నా ప్రైవేట్‌వాహనదారుల్లో మార్పు రావడంలేదు.

Advertisement
 
Advertisement
Advertisement