రావణలంక | Sakshi
Sakshi News home page

రావణలంక

Published Mon, Feb 17 2020 5:34 AM

Ravana Lanka Movie Motion Poster Release - Sakshi

మురళీ శర్మ, దేవ్‌ గిల్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రానికి ‘రావణ లంక’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. బీఎన్‌ఎస్‌ రాజు దర్శకత్వంలో క్రిష్‌ సమర్పణలో కె. సిరీస్‌ మూవీ ఫ్యాక్టరీ బేనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో క్రిష్, అస్మిత, త్రిష ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తయిన ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఆదివారం  చిత్రం మోషన్‌ పోస్టర్, ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా బీఎన్‌ఎస్‌ రాజు మాట్లాడుతూ – ‘‘ఇదొక సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌. గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిస్తున్నాం. ఉజ్జల్‌ మంచి ట్యూన్స్‌ ఇచ్చారు. కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడిన పాటలు హైలైట్‌. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement