‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట | Rathnavelu Tweet About Sye Raa Movie | Sakshi
Sakshi News home page

సైరా యాక్షన్‌ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే

Jul 23 2019 8:22 PM | Updated on Jul 29 2019 3:49 AM

Rathnavelu Tweet About Sye Raa Movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌పై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తుండటంతో ఆలస్యమవుతోంది. చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు మేకర్స్‌. షూటింగ్‌ను కంప్లీట్‌ చేసిన చిత్రయూనిట్‌ తుది మెరుగులు దిద్దడంలో నిమగ్నమైంది. సైరా డీఐ చాలా బాగా వచ్చిందని, నైట్‌ ఎఫెక్ట్స్‌లో చిత్రీకరించిన యాక్షన్‌ సీన్స్‌.. విజువల్‌ ఫీస్ట్‌గా ఉంటుందని కెమెరామెన్‌ రత్నవేలు సోషల్‌ మీడియాలో తెలిపారు. ఈ పోరాట సన్నివేశాలు.. మెగా ఫ్యాన్స్‌కు రోమాలు నిక్కబొడిచేలా చేస్తాయని అన్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 2న విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement