‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’ | Rathnavelu Tweet About Sarileru Neekevvaru Movie | Sakshi
Sakshi News home page

స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌ : రత్నవేలు

Jul 22 2019 8:52 PM | Updated on Jul 22 2019 8:53 PM

Rathnavelu Tweet About Sarileru Neekevvaru Movie - Sakshi

‘ఎఫ్‌2’తో భారీ హిట్‌ కొట్టిన దర్శకుడు అనిల్‌ రావిపూడి.. సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మహర్షి సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ వద్ద తన స్టామినాను చూపిన మహేష్‌.. సైనికుడిగా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను జగపతి బాబు పోషించాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆపాత్రలో ప్రకాశ్‌ రాజ్‌ నటించబోతోన్నారని తెలుస్తోంది. 

కశ్మీర్‌లో చేస్తున్న ఈ మూవీ ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ అయిందని, ఆర్మీ లుక్‌లో మహేష్‌ అదిరిపోయాడని కెమెరామెన్‌ రత్నవేలు ట్వీట్‌ చేశారు. తనకు ఫెవరేట్‌ అయిన మహేష్‌ బాబుతో పనిచేయడం ఎల్లప్పుడూ ఎక్సైట్‌గా ఉంటుందని, అనిల్‌ రావిపూడితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. రెండో షెడ్యూల్‌ను ఈనెల 26నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement