కాకినాడలో కామ్రేడ్‌ | Rashmika Mandanna to play a cricketer in Dear Comrade | Sakshi
Sakshi News home page

కాకినాడలో కామ్రేడ్‌

Dec 12 2018 2:33 AM | Updated on Dec 12 2018 2:33 AM

Rashmika Mandanna to play a cricketer in Dear Comrade - Sakshi

విజయ్‌ దేవరకొండ

కామ్రేడ్‌ అంటే సహచరుడు. కామ్రేడ్‌ అనగానే చాలామందికి నక్సలైట్‌లు గుర్తుకువస్తారు. ఏదైనా ఉద్యోగంలో ఒక చోట పని చేస్తూ కలిసి ఉండే మిత్రులందరూ కామ్రేడ్సే. తన యాటిట్యూడ్‌తో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు హీరో విజయ్‌ దేవరకొండ. ఇప్పుడు విజయ్‌ నటిస్తున్న కొత్త సినిమా పేరు ‘డియర్‌ కామ్రేడ్‌’. ‘ఫైట్‌ ఫర్‌ వాట్‌ యూ లవ్‌’ అనేది ఉపశీర్షిక. ‘గీత గోవిందం’ చిత్రంతో విజయ్‌తో మంచి హిట్‌ పెయిర్‌ అనిపించుకున్న రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో ఆమె క్రికెటర్‌గా నటిస్తున్నారు. ఫన్‌ ఫిల్డ్‌ విత్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుందీ చిత్రం.  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌ బెన్‌ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల లడక్‌లో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కాకినాడలో షూటింగ్‌ జరుపుకుంటోంది. కాకినాడలో ఈ నెల 27 దాకా జరిగే షూటింగ్‌లో భాగంగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్రదర్శకుడు భరత్‌ కమ్మ. ఇప్పటివరకు దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది మే నెలలో విడుదల కానుందని సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement