సొంత గొంతుతో హిట్ హీరోయిన్‌

Rashmika Mandanna Dubs For Herself In Devadas - Sakshi

ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ రష్మిక మందన్న. తొలి సినిమాతోనే మంచి సక్సెస్‌ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఇటీవల గీత గోవిందం సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న రష్మిక, ప్రస్తుతం ఓ క్రేజీ మల్టీ స్టారర్‌ సినిమాలో నటిస్తున్నారు.

కింగ్ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నానిలు హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్‌ మూవీ దేవదాస్‌. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రష్మిక సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకునేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. గీత గోవిందంకే డబ్బింగ్ చెప్పుకోవాలని భావించినా డేట్స్ అడ్జస్ట్ కాక చెప్పలేకపోయారు. అందుకే ఈ సారి ఎలాగైన దేవదాస్‌లో సొంత గొంతు వినిపించేందుకు రెడీ అవుతున్నారు రష్మిక.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top