హిట్ హీరోయిన్‌ మేకప్‌ లేకుండా..!

Rashmika Acts Without Makeup In Next Film - Sakshi

ఛలో, గీత గోవిందం సినిమాలతో వరుస విజయాలు సాధించిన హీరోయిన్‌ రష్మిక మందన్న. ఈ రెండు సినిమాల్లో గ్లామర్‌ పరంగానే నటిగానూ రష్మికకు మంచి మార్కులు పడ్డాయి. గీత గోవిందం ఘనవిజయం సాధించటంతో టాలీవుడ్ లో రష్మికకు మంచి క్రేజ్‌ వచ్చింది. తాజాగా ఈ భామ విజయ్‌ దేవరకొండతో మరోసారి జోడి కడుతున్నారు.

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న డియర్‌ కామ్రేడ్‌ సినిమాలో రష్మిక హీరోయిన్‌ గా నటిస్తున్నారు. డిఫరెంట్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మేకప్‌ లేకుం‍డా నటిస్తున్నారు. భరత్‌ కమ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, బిగ్‌ బెన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ సినిమాతో పాటు నాగార్జున, నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ దేవ్‌దాస్‌లోనూ నానికి జోడిగా నటిస్తున్నారు రష్మిక.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top