రణబీర్.. కత్రినా.. ఓ అద్దె ఫ్లాటు! | Ranbeer kapur and katrina kaif rent a flat in mumbai | Sakshi
Sakshi News home page

రణబీర్.. కత్రినా.. ఓ అద్దె ఫ్లాటు!

Nov 11 2014 4:37 PM | Updated on Sep 2 2017 4:16 PM

రణబీర్.. కత్రినా.. ఓ అద్దె ఫ్లాటు!

రణబీర్.. కత్రినా.. ఓ అద్దె ఫ్లాటు!

రణబీర్ కపూర్.. కత్రినా కైఫ్ వీళ్లిద్దరూ ప్రేమపక్షుల్లా ఎక్కడెక్కడికో ఎగిరిపోతున్నారని చాలా కాలంగా బాలీవుడ్ కోడై కూస్తున్న సంగతి తెలిసిందే.

రణబీర్ కపూర్.. కత్రినా కైఫ్ వీళ్లిద్దరూ ప్రేమపక్షుల్లా ఎక్కడెక్కడికో ఎగిరిపోతున్నారని చాలా కాలంగా బాలీవుడ్ కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పక్షులు రెండూ కలిసి ఓ గూడు కూడా చూసుకున్నాయట. ముంబై శివార్లలో తమ ప్రేమను పండించుకోడానికి ఓ మంచి అపార్టుమెంట్ వెతుక్కున్నారట. బాలీవుడ్ స్టార్లలో ఎవరెక్కడ ఉంటున్నారో గమనిస్తూ ఉండే ఔత్సాహికులు ఈ విషయాన్ని కనుగొని బయటకు తెచ్చారు. ఈ గూడుకు వాళ్లు నెలకు అక్షారలా 15 లక్షల రూపాయల అద్దె చెల్లించేందుకు అంగీకరించారట.

కావాలనుకుంటే అటు రణబీర్ కపూర్ గానీ, ఇటు కత్రినా కైఫ్ గానీ సొంతంగా ఫ్లాట్ కొనాలనుకుంటే అది పెద్ద విషయం కాదు. ఓ 15 కోట్లు పడేస్తే ఫ్లాట్ వచ్చేస్తుంది. కానీ.. అలా చేస్తే అందరికీ మరీ ఎక్కువ ప్రచారం అయిపోతుందనే వాళ్లు అద్దెకు తీసుకున్నారని చెప్పారు. కొన్ని వారాల నుంచే వీళ్లు ఫ్లాట్ అద్దెకు తీసుకున్న విషయం బయట వార్తల్లో నానుతూ వస్తోంది. అప్పుడప్పుడు సెలవులు గడిపేందుకు ఈ జంట థాయ్లాండ్ కూడా వెళ్లొస్తూ ఉంటుంది. బహుశా ఫిబ్రవరిలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవచ్చని కూడా అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement