'ఓ చిన్న భారతీయ నటుడిని నేను' | Ranadaggubati with amithab bachchan | Sakshi
Sakshi News home page

'ఓ చిన్న భారతీయ నటుడిని నేను'

Mar 30 2016 5:59 PM | Updated on Aug 11 2019 12:52 PM

'ఓ చిన్న భారతీయ నటుడిని నేను' - Sakshi

'ఓ చిన్న భారతీయ నటుడిని నేను'

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకుంటున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు బిగ్ బీకి శుభాకాంక్షలు...

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకుంటున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు బిగ్ బీకి శుభాకాంక్షలు తెలియజేయగా, టాలీవుడ్ హంక్ రానా కూడా తనదైన స్టైల్లో బిగ్ బీపై తన గౌరవాన్ని ప్రకటించాడు. ఈ సందర్భంగా అమితాబ్ జాతీయ అవార్డ్ అందుకున్న ప్రతీసారి తాను కూడా అక్కడే ఉన్నానంటూ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు.

అమితాబ్ తొలిసారిగా 'బ్లాక్' చిత్రానికి గాను జాతీయ అవార్డును అందుకున్నారు. అయితే అదే ఏడాది 'బొమ్మలాట' సినిమాను నిర్మించిన రానా, ఆ సినిమాతో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత 'పా' చిత్రంలో నటనకు గాను బిగ్ బీ, జాతీయ అవార్డ్ సాధించగా, అదే వేడుకల్లో నిర్మాత డి రామానాయుడు గారికి దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందించారు. ఈ సందర్భంగా రానా సహా దగ్గుబాటి ఫ్యామిలీ అంతా అక్కడే ఉంది.

తాజాగా పీకు సినిమాకు గాను అమితాబ్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటుండగా, బాహుబలి సినిమాతో రానా మరోసారి అమితాబ్తో  వేదిక పంచుకోనున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో వెల్లడించిన రానా, 'అమితాబ్ బచ్చన్ లాంటి మహానటుడిగా కాలంలో నటించే అదృష్టం దక్కించుకున్న ఓ చిన్న భారతీయ నటుడిని నేను' అంటూ బిగ్ బీపై తన గౌరవాన్ని ప్రకటించాడు రానా.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement