ఇద్దరు భామలతో భల్లాలదేవుడు | rana to romance two heroines in his next | Sakshi
Sakshi News home page

ఇద్దరు భామలతో భల్లాలదేవుడు

Jul 9 2016 2:14 PM | Updated on Aug 11 2019 12:52 PM

ఇద్దరు భామలతో భల్లాలదేవుడు - Sakshi

ఇద్దరు భామలతో భల్లాలదేవుడు

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా సోలో హీరోగా స్టార్ ఇమేజ్ మాత్రం సాధించలేకపోయాడు.

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా సోలో హీరోగా స్టార్ ఇమేజ్ మాత్రం సాధించలేకపోయాడు. సోలో హీరోగా ఒక్క భారీ హిట్ కూడా నమోదు చేయని రానా, సపోర్టింగ్ రోల్స్లో మాత్రం ఆకట్టుకుంటున్నాడు.  ముఖ్యంగా బాహుబలి సినిమాలో ప్రతినాయక పాత్రలో కనిపించిన ఈ కండల వీరుడు ఇప్పుడు సోలో హీరోగా స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు.

బాహుబలి రెండో భాగంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఘాజీ సినిమాల్లో నటిస్తున్నాడు రానా. ఈ రెండు సినిమాల తరువాత తేజ దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్లో నటించనున్నాడు. ఈ సినిమాలో తొలిసారిగా ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాలో కాజల్, కేథరిన్ థెరిస్సాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మంచి విజయాలు సాధిస్తున్న రానా.. ఈ ఇద్దరు భామలతో కలిసి మాస్ హీరోగా ప్రూ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement