‘ఆటగాళ్ళ’ కోసం రానా

Rana To Launch The Teaser Of Aatagallu - Sakshi

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో నారా రోహిత్‌ త్వరలో ఆటగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను శనివారం రిలీజ్ చేయనున్నారు.

శనివారం ఉదయం పదిన్నరకు యంగ్ హీరో రానా చేతుల మీదుగా ఈ టీజర్‌ ను రిలీజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తీక్‌ సంగీతమందిస్తున్నారు. రోహిత్ సరసన బెంగాలీ మోడల్‌ దర్శన బానిక్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జూలై మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top