'బిజీగా ఉన్నా.. కాదనలేకపోయా..!' | Rana just couldnt say no to a bilingual thriller | Sakshi
Sakshi News home page

'బిజీగా ఉన్నా.. కాదనలేకపోయా..!'

Jan 22 2016 1:34 PM | Updated on Aug 11 2019 12:52 PM

'బిజీగా ఉన్నా.. కాదనలేకపోయా..!' - Sakshi

'బిజీగా ఉన్నా.. కాదనలేకపోయా..!'

ఇప్పటికే చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న యంగ్ హీరో రానా మరో సినిమాకు కమిట్ అయ్యాడు.

ఇప్పటికే చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న యంగ్ హీరో రానా మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం తొలి సబ్ మెరైన్ వార్ ఫిలింగా తెరకెక్కుతున్న ఘాజీలో నటిస్తున్న రానా, ఈ సినిమాతో పాటు బాహుబలి 2 షూటింగ్కు కూడా రెడీ     అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే లీడర్ సినిమాకు సీక్వల్ను కూడా లైన్లో పెట్టాడు. ఇవి కాకుండా రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బెంగళూర్ డేస్' రీమేక్ రిలీజ్కు రెడీగా ఉంది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న రానా ఇప్పుడు మరో సినిమాకు ఓకె చెప్పాడు. తమిళ రచయిత డేవిడ్ చెప్పిన కథ విపరీతంగా నచ్చటంతో, ఇంత బిజీ షెడ్యూల్ లోనూ డేవిడ్తో బైలింగ్యువల్ సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. థ్రిల్లింగ్ స్క్రీన్ప్లేతో ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాను రూపొందించనున్నారు. డేవిడ్ చెప్పిన లైన్ చాలా నచ్చింది అందుకే ఇంత బిజీలోనూ ఆ సినిమాను కాదనలేకపోయానన్నాడు రానా.

Advertisement
 
Advertisement
Advertisement