రాష్ట్రపతి ప్రణబ్‌కు రానా లేఖ
దేశం కోసం ప్రాణత్యాగం చేసి మరుగున పడి పోయిన సైనికుల గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని సినీ నటుడు దగ్గుబాటి రానా తెలిపారు.
ముంబై:
దేశం కోసం ప్రాణత్యాగం చేసి మరుగున పడి పోయిన సైనికుల గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని సినీ నటుడు దగ్గుబాటి రానా తెలిపారు. త్వరలో విడుదల కానున్న ‘ది ఘాజీ అటాక్’ సినిమాలో రానా లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మ పాత్రలో నటించారు. 1971లో పాక్‌తో జరిగిన యుద్ధం సందర్భంగా భారత నావికాదళం చేపట్టిన ఆపరేషన్ లో కమాండర్ అర్జున్ వర్మ కీలకపాత్ర పోషించారు. ఈ ఆపరేషన్ సందర్భంగా అర్జున్ వర్మ 18 రోజులపాటు సముద్రగర్భంలోనే గడిపారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా తాము అనేక మంది సైనికాధికారులతో మాట్లాడామని.. ఈ సందర్భంగా వారు చెప్పిన వీరోచిత గాధలు దేశ పౌరులందరికీ తెలియాల్సిన ప్రాముఖ్యత కలిగినవని రానా చెప్పారు.
సరిహద్దుల్లో ఉంటూ దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెడుతున్న వీర సైనికుల గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందులో రాష్ట్రపతి ప్రణబ్‌ను కోరానని ముంబైలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత్- పాక్ యుద్ధంలో పాకిస్తాన్‌కు చెందిన సబ్‌మెరీన్ పీఎన్‌ఎస్ ఘాజీని భారత నేవీ ఎలా ముంచేసిందనే ఇతి వృత్తంగా ‘ఘాజీ’ సినిమా తీశారు. ఈ సినిమాలో అతుల్ కుల్‌కర్ణి, కేకే మీనన్, తాప్సీ పొన్ను, దివంగత ఓంపురి తదితరులు నటించారు.