చాళుక్య వీరభద్రునిగా... | Rana Daggubati to play Prince Chalukya Veerabhadra in 'Rudramadevi' | Sakshi
Sakshi News home page

చాళుక్య వీరభద్రునిగా...

Dec 14 2013 1:16 AM | Updated on Sep 2 2017 1:34 AM

చాళుక్య  వీరభద్రునిగా...

చాళుక్య వీరభద్రునిగా...

భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ త్రీడీ చిత్రంగా ‘రుద్రమదేవి’ రూపొందుతోంది. అనుష్క టైటిల్‌రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని గుణశేఖర్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు.

భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ త్రీడీ చిత్రంగా ‘రుద్రమదేవి’ రూపొందుతోంది. అనుష్క టైటిల్‌రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని గుణశేఖర్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇందులో కీలకమైన చాళుక్య వీరభద్రుడు పాత్రను రానా పోషిస్తున్నారు. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా, రానా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘రానా విగ్రహానికి, అతని స్ఫురద్రూపానికి తగ్గట్టుగా ఈ పాత్ర ఉంటుంది. రానా ఓ ఛాలెంజ్‌గా తీసుకుని ఈ పాత్ర చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా కూడా రానా పర్సనాల్టీని మెచ్చి ఎంతో ఉత్సాహంతో అతని దుస్తులు స్పెషల్‌గా డిజైన్ చేస్తున్నారు. ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సమీపంలోని కుంటాల జలపాతం దగ్గర రానా, అనుష్కపై చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు పాటలు చాలా బాగా వచ్చాయి’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement