మరో వారసుడు రెడీ అవుతున్నాడు | Rana brother Daggubati Abhiram Debut Movie | Sakshi
Sakshi News home page

మరో వారసుడు రెడీ అవుతున్నాడు

Published Sun, Jun 26 2016 8:43 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

మరో వారసుడు రెడీ అవుతున్నాడు - Sakshi

టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసుల జోరు బాగా కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా అరడజనుకు పైగా హీరోలు సందడి చేస్తుంటే, నందమూరి, అక్కినేని ఫ్యామిలీల నుంచి కూడా వారసులు క్యూ కడుతున్నారు. అదే బాటలో ఇప్పుడు మరో సినీ కుటుంబం నుంచి యంగ్ హీరో ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. నిర్మాతగా తెలుగు సినీ రంగాన్ని శాసించిన దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే సీనియర్ హీరో వెంకటేష్తో పాటు, యంగ్ హీరో రానాలు టాలీవుడ్ స్క్రీన్పై సందడి చేస్తుండగా ఇప్పుడు రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే నిర్మాణ రంగంలో తన మార్క్ చూపిస్తున్న అభిరామ్ తన బాడీ లాంగ్వేజ్కు తగ్గ కథ కోసం వెతకటం మొదలు పెట్టాడు. త్వరలోనే తాను హీరోగా తెరకెక్కబోయే సినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకోనున్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement