మొన్న శివగామి... ఇప్పుడు మాతంగి | Ramya Krishna new movie Mathangi | Sakshi
Sakshi News home page

మొన్న శివగామి... ఇప్పుడు మాతంగి

May 14 2017 1:20 AM | Updated on Sep 5 2017 11:05 AM

మొన్న శివగామి... ఇప్పుడు మాతంగి

మొన్న శివగామి... ఇప్పుడు మాతంగి

‘బాహుబలి–2’లో రాజమాత శివగామిగా రమ్యకృష్ణ తప్ప మరో నటి సాటి రాలేరనే స్థాయిలో ఆమె నటనపరంగా విజృంభించారు.

‘బాహుబలి–2’లో రాజమాత శివగామిగా రమ్యకృష్ణ తప్ప మరో నటి సాటి రాలేరనే స్థాయిలో ఆమె నటనపరంగా విజృంభించారు. ఇప్పుడు మరో సినిమాలో రమ్యకృష్ణ నట విశ్వరూపాన్ని చూడబోతున్నాం. మలయాళంలో ఆమె నటించిన ఓ చిత్రం ‘మాతంగి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది.

కన్నన్‌ తమరక్కులమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్‌ థ్రిల్లర్‌ మూవీని రమ్యకృష్ణ సోదరి వినయ్‌కృష్ణన్‌ తెలుగులోకి అనువదించారు. సోదరితో వెయ్యి ఎపిసోడ్స్‌ ‘వంశం’ సీరియల్‌ నిర్మించిన వినయ్‌కృష్ణన్‌ ఆ అనుభవంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘మాతంగిగా రమ్యకృష్ణ అద్భుతంగా నటించారు. మదర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించింది. రితేష్‌ అందించిన నేపథ్య సంగీతం హైలైట్‌ అవుతుంది’’ అని వినయ్‌కృష్ణన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement