టాలీవుడ్లో సినిమాలకు టైటిల్ సమస్య చాలా కామన్. అయితే ఇలా వివాదాలు వచ్చిన సమయంలో పెద్దలు జోక్యం చేసుకొని సర్దుబాటు చేయటం, లేదా.. ఎవరో ఒకరు వెనక్కి తగ్గి టైటిల్ మార్చుకోవటం జరుగుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం రామ్‌చరణ్ లాంటి టాప్ స్టార్కే ఈ సమస్య ఎదురైంది. పోటీకి వచ్చింది కూడా వాళ్లూ వీళ్లూ కారు. ఎవరి మాట వినని సీతయ్య లాంటి రామ్‌గోపాల్ వర్మ కావటంతో చెర్రీ కూడా చేసేది లేక తన సినిమాను ట్యాగ్ లైన్ తో కలిపి ప్రమోట్ చేసుకుంటున్నాడు.
'గోవిందుడు అందరివాడేలే' సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న చెర్రీ.. ఇప్పుడు శ్రీను వైట్ల డైరెక్షన్ లో 'బ్రూస్ లీ' సినిమా చేశాడు. మాస్ ను అలరించే యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా పర్ఫెక్ట్ గా ఉన్న ఈ సినిమా చెర్రీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. సినిమా ప్రమోషన్ స్పీడు పెంచే సమయానికి అదే పేరుతో మరో సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తొలి భారతీయ మార్షల్ ఆర్ట్ చిత్రం అంటూ 'బ్రూస్ లీ' టీజర్ రిలీజ్ అయ్యింది. అందమైన అమ్మాయితో మార్షల్ ఆర్ట్స్ ఫైటింగులు చేయిస్తూ.. తనదైన శైలిలో టీజ్ చేస్తున్నాడు వర్మ.
దీంతో ఆలోచనలో పడ్డ రామ్ చరణ్ బ్రూస్ లీ టీం తమ సినిమాను 'బ్రూస్ లీ ది ఫైటర్' పేరుతో ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటివరకు తన ట్వీట్ లతో స్టార్ హీరోలను ఇబ్బంది పెట్టే వర్మ.. ఈ సారి ఏకంగా సినిమాతోనే ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇలాంటివేవీ పట్టించుకొని వర్మ ఇప్పటికే టీజర్ తో పాటు వీడియో సాంగ్ ను కూడా రిలీజ్ చేశాడు. అయితే వర్మ తన సినిమా రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
చరణ్ కి ఈ సమస్య తెలుగులోనే కాదు, తమిళ ఇండస్ట్రీలో కూడా తప్పటం లేదు. జివి ప్రకాష్ హీరోగా తమిళ్ లో రూపొందుతున్న ఓ సినిమాకు 'బ్రూస్ లీ' అనే టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేశారు. దీంతో చేసేదేమీ లేక చరణ్ తమిళ్ వర్షన్ కు 'బ్రూస్ లీ2' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు, ఇలా ఒకే పేరుతో ఒకే సమయంలో మూడు సినిమాలు సందడి చేయటం బహుశా భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే తొలిసారి.
బ్రూస్ లీ vs బ్రూస్ లీ
Published Thu, Oct 15 2015 8:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement