నవ్వులే నవ్వులు | ramasakkani sita movie first look relese | Sakshi
Sakshi News home page

నవ్వులే నవ్వులు

Jan 4 2019 4:11 AM | Updated on Jan 4 2019 4:11 AM

ramasakkani sita movie first look relese - Sakshi

సుకృత, ఇంద్ర

మహాకవి వాల్మీకి రాసుకున్న రామాయణం నిజం అయితే తాను రాసుకున్న కథ కూడా నిజమే అంటున్నాడు దర్శకుడు శ్రీ హర్ష మండ. ఇంద్ర, సుకృత వాగ్లే జంటగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామ చక్కని సీత’. క్రొకోడైల్‌ క్రియేషన్స్, లియో సెల్యులాయిడ్స్‌ బ్యానర్స్‌పై విశాలాక్ష్మి మండ, జి.ఎల్‌. ఫణికాంత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘రామ చక్కని సీత’. శ్రీ హర్ష మండ సినిమాని చక్కగా తెరకెక్కిస్తున్నారు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది. కేశవ కిరణ్‌ సంగీతం, మురుగన్‌ గోపాల్‌ సినిమాటోగ్రఫీ, గ్యారీ బి హెచ్‌ ఎడిటింగ్‌ ఈ చిత్రానికి హైలైట్‌’’ అన్నారు. ప్రియదర్శి, కాశీ విశ్వనాథ్, అభయ్, ‘బుల్లెట్‌’ భాస్కర్, ‘జబర్దస్త్‌’ అప్పారావు, మధుమణి, రాహుల్‌ సిప్లిగంజ్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement