
ప్రముఖ హీరో రామ్ తన అభిమానులకు ఓ సందేశాన్ని పంపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తన పుట్టిన రోజు వేడుకలకు అభిమానులు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే అభిమానుల ఆరోగ్యం, సంతోషమే తనకు ముఖ్యమని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అభిమానులు చూపించే ప్రేమకు తన మనసులో ప్రత్యేక స్థానం ఉంటుందని రామ్ పేర్కొన్నారు. (చదవండి : ఆస్కార్ అవార్డులు వాయిదా!)
ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని.. అదే తనకు ఇచ్చే అసలైన పుట్టిన రోజు కానుకగా భావిస్తానని రామ్ అన్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. రామ్ ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రెడ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి : మా `రెడ్` యూనిట్‌కు అలాంటి అనుభవాలే..)
To my ❤️s.. #StayHomeStaySafe - Stay Strong!
— RAm POthineni (@ramsayz) May 12, 2020
Love..#RAPO pic.twitter.com/wTmlievzxN