ఆస్కార్‌ అవార్డులు వాయిదా! | Coronavirus : Oscar Award Program Postponed Due To Coronavirus | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ అవార్డులు వాయిదా!

May 12 2020 2:04 PM | Updated on May 12 2020 2:04 PM

Coronavirus : Oscar Award Program Postponed Due To Coronavirus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2021, ఫిబ్రవరి 28వ తేదీన జరగాల్సిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నాలుగు నెలల పాటు వాయిదా వేయాలనుకుంటున్నారు. ప్రాణాంతక కరోన వైరస్‌ మహమ్మారి కారణంగా చాలా సినిమాలు నిర్మాణ దశలోనే నిలిచిపోవడం, కొత్త సినిమాలు ఎక్కువగా విడుదలకు నోచుకోక పోవడంతో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేయాలనుకుంటున్నారు.
(చదవండి : శుభ‌శ్రీతో మాట్లాడిన మెగాస్టార్)

భారతీయ కాలమానం ప్రకారం సాధారణంగా సమ్మర్‌లో బ్లాక్‌బస్టర్‌ కమర్శియల్‌ సినిమాలు విడుదలవుతాయి. ఆ తర్వాత అకాడమి అవార్డులను దృష్టిలో పెట్టుకొని నవంబర్, డిసెంబర్‌ నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రత్యేక సినిమాలు విడుదలవుతాయి. నవంబర్, డిసెంబర్‌ నెలల్లో సినిమాలు విడుదల కావాలంటే ఇప్పటికే సినిమా షూటింగ్‌లు ప్రారంభం కావాలి. కానీ ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను కుదుపేస్తున్న నేపథ్యంలో అలా జరగలేదు. ఏప్రిల్‌ నెలలో విడుదల కావాల్సిన బ్లాక్‌బస్టర్‌ జేమ్స్‌ బాండ్‌ చిత్రమే నవంబర్‌ నెలకు వాయిదా పడింది. ఎక్కువ సినిమాల నామినేషన్లకు అవకాశం ఇవ్వడం కోసం ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేయాలనే ప్రతిపాదనపై నిర్వాహకులు గత వారం, పది రోజులుగా చర్చలు జరపుతున్నారు. తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement